సిక్స్ ప్యాక్ లుక్ తో సర్ప్రైజ్ చేసిన మంచు విష్ణు

సిక్స్ ప్యాక్ లుక్ తో సర్ప్రైజ్ చేసిన మంచు విష్ణు

Published on Nov 23, 2015 2:02 PM IST

sarada
తెలుగు ప్రేక్షకులకు బాగా తక్కువ పరిచయం ఉన్న యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ‘డైనమైట్’ లాంటి సినిమా చేసిన హీరో మంచు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘సరదా’. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ పై డి.కుమార్‌ – పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం మూడవ షెడ్యూల్ కోసం సిద్దమవుతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే అమలా పాల్ ని కూడా పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు మంచు విష్ణు బర్త్ డే.. బర్త్ డే కానుకగా సరదా సినిమాలోని మంచు విష్ణు సిక్స్ ప్యాక్ లుక్ స్టిల్ ని ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసారు. మంచు విష్ణు తన బాడీని ఫుల్ గా టోన్ చేసిన విధానం, తన 6 ప్యాక్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ లుక్ ప్రకారం ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని ఆశించవచ్చు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మంచు విష్ణుకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు