​సుహాస్, సూరిల ‘మండాడి’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ 

​సుహాస్, సూరిల ‘మండాడి’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ 

Published on Jul 18, 2026 8:00 AM IST

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మండాడి’. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ విడుదల చేయనుంది. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

​చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బోట్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ యాక్షన్ కోరియోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు