మణికర్ణిక మొదటి రోజు ఎంత రాబట్టిందంటే !

Published on Jan 26, 2019 8:26 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ నిన్న 50దేశాల్లో దాదాపుగా 2900 స్క్రీన్లలో విడుదలైయింది. అయితే మొదటి రోజు మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజు ఈచిత్రం తెలుగు , హిందీ , తమిళ భాషల్లో కలిపి ఇండియాలో 8.75కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక శనివారం , ఆదివారం ఈచిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్నిక్రిష్ జాగర్లమూడి , కంగనా సంయుక్తంగా తెరక్కించారు. శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందించిన ఈచిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి కమల్ జైన్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More