‘మణికర్ణిక’ మూడు భాషల్లో విడుదలకానుంది !

‘మణికర్ణిక’ మూడు భాషల్లో విడుదలకానుంది !

Published on Dec 12, 2018 9:20 AM IST

బాలీవుడ్ స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 18న విడుదల చేయనున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ తో పాటు , తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. నిజానికి ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అయ్యింది.

వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు