మణిరత్నం క్రియేషన్ “నవరస” రన్ టైం ఎంతంటే?

Published on Jul 13, 2021 11:58 am IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న అంథాలజి చిత్రం, వెబ్ సిరీస్ అయిన నవరస కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ ఇందుకు ప్రమోషన్స్ ను షురూ చేసింది. తూరిగా అంటూ థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. అయితే మొత్తం తొమ్మిది రసాలను దర్శక నిర్మాతలు పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. దీని కోసం సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు కృషి చేశారు. అయితే నవరస సీజన్ వన్ నిడివి 4 గంటల ముప్పై నిమిషాలకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ తొమ్మిది రసాలు ఎదురి, సమ్మర్ ఆఫ్ 92, ప్రాజెక్ట్ అగ్ని, పాయసం, పీస్, రౌద్రం, ఇన్మయ్, తునింత పిన్, గిటార్ కంబీ మేల్ నిండ్రు లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 6 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

సంబంధిత సమాచారం :