మణిరత్నం క్రియేషన్ “నవరస” ట్రైలర్ విడుదల!

Published on Jul 27, 2021 11:51 am IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంథాలజీ డ్రామా గా రానున్న ఈ సీరీస్ లో మొత్తం 9 రసాలను 9 ఎపిసోడ్ లుగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ సీరీస్ కు సంబంధించిన పోస్టర్లు, పాటలు, ఇంట్రడక్షన్ వీడియో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నవరస టీమ్ తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

దీపక్ భోజ్ రాజ్ కట్ చేసిన ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు గోవింద్ వసంత సంగీతం అందించగా, తపస్ నాయక్ సౌండ్ డిజైన్ మరియు మిక్స్ అందించడం జరిగింది. ఈ తొమ్మిది ఎపిసొడ్ లను అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తిక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజు, ప్రియదర్శన్, రతింద్రన్ ఆర్ ప్రసాద్, సర్జన్ కే ఎం, వసంత్ ఎస్ సాయి లు దర్శకత్వం వహించారు. అయితే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.

సంబంధిత సమాచారం :