మణిరత్నం ‘నవరస’ రిలీజ్ ఎప్పుడంటే..

Published on May 27, 2021 9:00 pm IST

మణిరత్నం అంటే ప్రతి పరిశ్రమలోనూ ఒక రెస్పెక్ట్, ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే ఆయన ఈసారి ఓటీటీ ద్వారా ప్రయోగం చేస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిదిమంది నటులతో తొమ్మిది కథలను తీసుకుని వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆయన. ఈ వెబ్ సిరీస్ కు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సిరీస్ ఉండనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఆగష్టు నెలలో రిలీజ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

హాస్యం, భయనకం, శృంగారం, రౌద్రం లాంటి తొమ్మిది రసాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్లో ఉండే తొమ్మిది కథలు రూపొందుతున్నాయి. కేవీ ఆనంద్‌, గౌతమ్‌ మీనన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, పొన్‌రామ్‌, హలిత షలీమ్‌, కార్తీక్‌ నరేన్‌, రతీంద్రన్‌, బిజో నంబియార్, అరవింద్ స్వామి, సిద్దార్థ్ తొమ్మిది ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తొమ్మిది కథల్లో రేవతి, సూర్య, విజయ్‌ సేతుపతి, సిద్ధార్థ, అరవిందస్వామి, నిత్యామీనన్‌, ఐశ్వర్యారాజేష్‌, రిత్విక, పూర్ణ, ప్రకాశ్‌రాజ్‌, బాబీసింహ, జై, స్నేహ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఏ. ఆర్‌ రెహమాన్‌, గోవింద్‌ వసంతన్‌, జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :