‘ఆచార్య’ మ్యూజిక్ పై క్రేజీ అప్ డేట్ !

‘ఆచార్య’ మ్యూజిక్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Jul 12, 2020 7:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ‘ఆచార్య’ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా మణిశర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య సంగీతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. “ఆచార్య ఆల్బమ్‌ లో ఎక్కువగా సందర్భోచితమైన పాటలే ఉంటాయని వెల్లడించారు. ఓవరాల్ గా ఆల్బమ్‌లో ఒక సిజ్లింగ్ స్పెషల్ సాంగ్, ఒక రొమాంటిక్ డ్యూయెట్, ఒక ఎమోషనల్ సాంగ్ మరియు డ్యాన్స్ నంబర్ ఉన్నాయని. అలాగే ఈ చిత్రంలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని’ మణిశర్మ తెలిపారు.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. అలాగే మెగా వారసురాలు నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు