మెగాస్టార్ లాంచ్ చేసిన సుధీర్ బాబు, మణిశర్మల మాస్ నెంబర్.!

Published on Jul 9, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా పావెల్ నవగీతన్ హీరోయిన్ గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఆసక్తికర నేపథ్యంలో మంచి క్యారక్టరైజేషన్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి బజ్ కూడా ఉంది. అలాగే ఇటీవలే వచ్చిన ఈ చిత్రం టీజర్ కి కూడా జెనరల్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే.

మంచి స్వింగ్ లో ఉన్న మణిశర్మ ఈ సినిమాకి కూడా ట్యూన్స్ ఇస్తున్నట్టు అర్ధం అయ్యిపోయింది. మరి ఈరోజు లేటెస్ట్ గా ఓ మాంచి మాస్ మసాలా ఫోక్ నెంబర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా మేకర్స్ రిలీజ్ చేయించారు.. “మందులోడా” అనే ఈ పక్కా ఫోక్ సాంగ్ ను మణిశర్మ సూపర్ గా ట్యూన్ కట్టగా దానికి సుధీర్ బాబు ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఇది వరకే కొన్ని జానపద గేయాలకు మరింత మంచి ట్యూనింగ్ ఇచ్చి కంపోజ్ చెయ్యడంలో మణిశర్మ దిట్ట అని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీనితో ప్రూవ్ చేశారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ముఖ్యంగా మాస్ యువతను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో నరేష్ రఘుబాబు, సత్యం రాజేష్, హర్ష వర్ధన్ తదితరులు నటిస్తుండగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :