వెంకీ ఛాయిస్ కూడా అతనే

Published on Nov 21, 2019 12:49 pm IST

తెలుగు సంగీత దర్శకుల్లో టాప్ లిస్ట్ తీస్తే మణిశర్మ పేరు తప్పకుండా ఉంటుంది. కానీ కొన్నాళ్ల క్రితం వరకు పెద్ద సినిమాలు లేక ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఫామ్లోకి వచ్చారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టుకుని మళ్లీ పూర్వపు హవా కొనసాగించడానికి సిద్దమవుతున్నారు.

మెగాస్టార్ చిరు, కొరటాల శివల చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కించుకున్న ఆయన ఇప్పుడు వెంకటేష్ యొక్క ‘అసురన్’ తెలుగు రీమేక్ కు కూడా సంగీతం ఇవ్వనున్నారని తెలుస్తోంది. తమిళంలో ‘అసురన్’ అంత పెద్ద విజయం సాధించడం వెనుక నేపథ్య సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే తెలుగులో కూడా అలాంటి బలమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రావాలంటే మణిశర్మకే సాధ్యమని ఆయన్ను తీసుకొని ఉండవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మణిశర్మ చేతిలో ఇంకొన్ని బడా ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More