మన్మధుడు 2 ప్రీ రిలీజ్ బిసినెస్ బాగుంది

Published on Aug 8, 2019 11:54 am IST

నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2` రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే “మన్మధుడు 2” చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో పాటు,చిత్ర యూనిట్ విరివిగా ప్రమోషన్స్ నిర్వహించడంతో ప్రీ రీలీజ్ బిజినెస్ కూడా ఆశాజనకంగా ఉందని సమాచారం. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్రలోని గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో కలిపి దాదాపు 2.68 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. గుంటూరు ఏరియా హక్కులు 1.40 కోట్లకు, కృష్ణ హక్కులు 1.28కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది నాగార్జున గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఇది ఎక్కువే అని ట్రేడ్ వర్గాల సమాచారం.

కాగా తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న కర్ణాటకలో కూడా మన్మధుడు 2 చిత్రానికి మంచి ధర పలికిందని సమాచారం. దీనితో చిత్ర దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ, లక్ష్మీ వంటి నటులు ముఖ్యపాత్రాలలో కనిపిస్తుండగా, కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.

మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :