“మన్మధుడు 2” ఓవర్ సీస్ లో భారీగానే…!

Published on Aug 7, 2019 10:32 am IST

కింగ్ నాగార్జున మన్మధు గా ఇంకా రెండు రోజులలో సందడి చేయనున్నాడు. ఆగస్టు 9న మన్మధుడు 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగార్జున, హీరోయిన్ రకుల్ విరివిగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా మన్మధుడు 2 యూఎస్ లో కూడా భారీగా విడుదల కానుందని సమాచారం. మన్మధుడు యూఎస్ విడుదలహక్కులను సొంతం చేసుకున్న యూఎస్ తెలుగు డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ 250 పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారట. అలాగే మన్మధుడు 2 మూవీ టికెట్ ధర $12గా నిర్ణయించారని సమాచారం. కామెడీ,రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మన్మధుడు2 చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్ర తెరకెక్కించిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్,వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ నటి లక్ష్మి,రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం :