నాగ్ అప్పుడు రావడమే బెస్ట్ !

Published on May 13, 2019 1:23 pm IST

కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం ‘మన్మథుడు 2’. కాగా తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జున పుట్టిన రోజు నాడు ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుదట. ఇదే సరైన డేట్ అని చిత్రబృందం భావిస్తోంది. ఆగస్టు 15న సాహో రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఎలాగూ వరుసగా సినిమాలు ఉంటాయి. కాబట్టి నాగ్ ఆగస్టు 29న సోలోగా రావడమే బెస్ట్ అని ‘మన్మథుడు 2’ టీమ్ అనుకుంటుంది.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత నెల రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ పోర్చు‌గ‌ల్‌ లో శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్ ఈ రోజుతో పూర్తయింది. ఇక తరవాతి షెడ్యూల్ ను మే 21వ తేదీ నుండి హైదరాబాద్ లో మొదలు కానుంది.

ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం :

More