కామెడీలో ‘మన్మథుడు’ని మించిపోతాడట !

Published on Jun 15, 2019 3:57 am IST

కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం ‘మన్మథుడు 2’. అయితే ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. ప్రత్యేకించి నాగ్ కామెడీ టైమింగ్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. మరి ‘మన్మథుడు 2’, కామెడీలో ‘మన్మథుడు’ మించిపోతాడేమో చూడాలి.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్

సంబంధిత సమాచారం :

More