‘నాగ్’కి కర్ణాటక & సీడెడ్ రైట్స్ బాగా పలికాయిగా !

Published on Aug 8, 2019 2:56 am IST

కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తోంది `మ‌న్మ‌థుడు 2` టీమ్. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కర్ణాటక రైట్స్ ను కోటి రూపాయిలకు అమ్ముడుపోయాయట.

అలాగే ఈ సినిమా సీడెడ్ రైట్స్ కూడా 1.5 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మొత్తానికి `మ‌న్మ‌థుడు 2` ప్రీ రిలీజ్ బిజినెస్ చాల బాగా జరిగినట్లే. మరి `మ‌న్మ‌థుడు 2` ఓపెనింగ్స్ ను ఏ రేంజ్ లో సాధిస్తాడో చూడాలి. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :