ట్రైలర్: మన్మధుడు2-కృష్ణుడే కాదు.. రాముడు కూడా…!

Published on Jul 25, 2019 11:58 am IST

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన “మన్మధుడు 2 ట్రైలర్” కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు రాహుల్ రవీంద్ర రొమాన్స్,ఫన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా “మన్మధుడు 2” చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అంటే ఇష్టపడని సామ్( నాగార్జున) ఫ్రీ బర్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, తన తల్లి లక్ష్మి మాత్రం అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలనీ ఆశపడుతూ ఉంటుంది. తన ఆశ తీర్చడానికి అవంతిక(రకుల్) సామ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ పెళ్లిని తప్పించుకోవడానికి సామ్ రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాడు.

గతంలో వచ్చిన “మన్మధుడు” సినిమాలలో నాగార్జున ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కోపంతో అసలు అమ్మాయిలంటే గిట్టని వాడిగా నటించారు. దానికి భిన్నంగా “మన్మధుడు 2″లో నాగార్జున అమ్మాయిలతో రొమాన్స్ ఒకే గాని పెళ్లంటే గిట్టని ముదురు బ్రహ్మచారి పాత్ర చేశారు. “ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయను” అనే డబుల్ మీనింగ్ డైలాగ్ తో తన పాత్రేమిటో చెప్పారు నాగార్జున. జీవితానికి భార్య తోడు ఎంత అవసరమో చెప్పే ఎమోషన్స్ చూపిస్తారనిపిస్తుంది.

ఇక ట్రైలర్ లో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. సీనియర్ నటి లక్ష్మి,ఘాన్సీ,రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. వియాకామ్ 18, మనం ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 9న విడుదల కానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :