” కాఫీ మగ్ … వైన్ పెగ్” ఆసక్తిరేపుతున్న మన్మథుడు2 టీజర్ రిలీజ్ పోస్టర్.

Published on Jun 11, 2019 5:17 pm IST

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘మన్మధుడు2’. 2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘మన్మధుడు’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. విజయ భాస్కర్ దర్శకత్వ ప్రతిభకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు తోడవడంతో ఈ మూవీ అల్ టైం ఫెవరేట్ మూవీలలో ఒకటిగా నిలిచిపోయింది.

ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ‘మన్మధుడు 2’ లో నాగార్జునకు తోడుగా రకుల్,కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన ఆన్ లొకేషన్స్ స్టిల్స్ లో నాగార్జున యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. నేడు చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశారు.ఈ నెల 13న మూవీ టీజర్ ను విడుదల చేయనున్నారు. ప్లేయింగ్ కార్డ్స్ లో ఆర్టీన్ కింగ్ కార్డు లా డిజైన్ చేసిన నాగార్జున రెండు చిత్రాలలో ఒకదాంట్లో కాఫీ మగ్, మరో దాంట్లో వైన్ పెగ్ పట్టుకొని ఆసక్తి రేపుతోంది. బహుశా ఈ మూవీలో నాగార్జున రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడో ఏమో,చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More