హుదూద్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం నుండి వైజాగ్ మరియు ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నారు. మొదటి రోజు సహాయక చర్యలు మొదలు పెట్టినప్పటి నుంచే హీరో మనోజ్ కూడా తన టీంతో కలిసి వైజాగ్ లో సహాయక చర్యలు చేపట్టాడు. అందులో భాగంగా వైజాగ్ లోనే ఉంటున్న మనోజ్ ఈ రోజు తను చేయనున్న కార్యక్రమాల గురించి తెలియజేశాడు.
‘నా తరపు నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బీచ్ రోడ్ లోని సబ్ మెరైన్ చుట్టూ ప్రక్కల ప్రాంతంలో 2500 ఫుడ్ పాకెట్స్, 5000 బిస్కట్ పాకెట్స్, 2 లక్షల వాటర్ పాకెట్స్ పంచి పెడుతున్నాం. అలాగే ఈ సప్లై మొత్తం అయిపోయిన తర్వాత మేము పంచిపెట్టిన ప్రాంతాన్ని పూర్తిగా క్లీన్ చేసి అక్కడి నుంచి భీమిలికి బయలుదేరుతాం అని’ మనోజ్ తెలిపాడు.
ఒక్క మనోజ్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు కూడా ప్రసతుతం అన్ని ఏరియాల్లో తిరిగి బాధితులను పరిష్కరిస్తున్నారు. అక్కడికి వెళ్ళలేని చాలా మంది సినీ ప్రముఖులు విరాళాల రూపంలో మనీ అందజేశారు.


