ఇంటర్వ్యూ : రాజా గౌతమ్ – మను నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా !

Published on Sep 5, 2018 3:59 pm IST

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నూతన దర్శకుడు ఫణింద్ర కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మను’. ఈనెల 7న విడుదలవుతున్న సందర్బంగా రాజా గౌతమ్ మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం ..

ఈచిత్రం చేయడానికి ఎంత సమయం పట్టింది ?

బసంతి చిత్రం తరువాత ఈచిత్రం చేయడానికి దాదాపు 3 సంవత్సరాల ఆరు నెలల సమయం పట్టింది. మనీ కంటే టైం ను ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాం కానీ మంచి అవుట్ ఫుట్ వచ్చింది. ఫణింద్ర ఈచిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు.

ఇన్ని సంవత్సరాలలో మీకు నచ్చిన కథ దొరకలేదా ?

దొరికాయి. కొన్ని కథలు బాగున్నాయి. కాని నాకు ఎందుకు ఒక డిఫ్రెంట్ జోనర్ లో సినిమా చేయాలని అనిపిచించేది కేక్ మను కథ వినంగానే ఓకే చెప్పేశా. ఇంత కాలం వెయిట్ చేసినందుకు ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాను.

చిత్రం ఎలా ఉంటుంది ?

చాలా బాగుంటుంది. చాలా కష్ట పడి చేశాం. ప్రేక్షకులను కొత్త లోకం లోకి తీసుకెళుతుంది. రొమాంటిక్ మిస్టరీ తో కూడుకున్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు.

చిత్ర దర్శకుడి గురించి ?

ఫణింద్ర ఇంతకుముందు రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు ఇదే మొదటి సినిమా. అందరు ఆయనను బాగా నమ్మారు. ఎంతలా అంటే ఈ చిత్రానికి ఫండ్స్ కావాలని పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. కేవలం నాలుగు రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయి . అది ఆయన మీద వున్నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చాలా బాగా తీశాడు.

కథ వినగానే మీ నాన్న గారు ఏమన్నారు ?

ఆయన ఫస్ట్ నుండి చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. మా డైరెక్టర్ తో కలిసి ఒక గంట సేపు కూర్చొని చర్చించాక ఆయనకు మా మీద ఇంకా గట్టి నమ్మకం ఏర్పడింది. ఈసినిమా ఎలాగైనా బాగా ఆడుతుందని అన్నారు.

మీ తదుపరి చిత్రాల గురించి ?

ఒక రెండు కథనలను ఒకే చేశాను . స్క్రిప్ట్ చాలా నచ్చింది. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ చిత్రం పైనే మను రిలీజ్ అయ్యాక వాటి గురించి ఆలోచిస్తా.

సంబంధిత సమాచారం :