రాఘవేంద్రరావు సినిమా.. విశేషాలు చాలానే ఉన్నాయి

Published on Dec 3, 2020 12:35 am IST

దర్శకుడిగా ఉన్నత శిఖరాలను చూసిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. త్వరలో ఆయన ప్రధాన పాత్రలో సినిమా మొదలుకానుంది. ఈ చిత్రానికి తణికెళ్ల భరణి దర్శకత్వం వహించనున్నారు. తనికెళ్ళ భరణి కేవలం నటుడు మాత్రమే కాదు.. మంచి రచయిత, దర్శకుడు కూడ. ఆయన రచయితగా చేసిన చాలా సినిమాలు బ్రహ్మాండమైన విజయాలను అందుకున్నాయి. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది.

సున్నితమైన సంబంధాలకు కమర్షియక్ టచ్ ఇవ్వడంలో భరణిగారిది అందెవేసిన చేయి. అందుకే ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు రాఘవేంద్రరావు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుండి మొదలుకానుంది. ఇందులో రాఘవేంద్రరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన సతీమణిగా స్టార్ నటి రమ్యకృష్ణ నటించనున్నారు. అలాగే శ్రియ, సమంతలు అతిథి పాత్రల్లో నటిస్తారనే టాక్ కూడ ఉంది. అలాగే రాఘవేంద్రరావు కుమార్తెగా స్టార్ నటిని తీసుకోనున్నారట.

సంబంధిత సమాచారం :

More