బోలెడు సప్రైజులతో మణిరత్నం సినిమా

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం తన మల్టీ స్టారర్ ప్రాజెక్టుకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి ఆఖరు నుండి మొదలుకానుంది. బోలెడు ఆసక్తికరమైన అంశాలతో నిండి ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ, రజనీ ‘2 పాయింట్ 0’ ను నిర్మిస్తున్న లేకా ప్రొడక్షన్స్ సంస్థ మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనుంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, ఫహద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి స్టార్లు నటిస్తున్నారు. అంతేగాక శింబు ఈ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు వర్కవుట్స్ కూడా మొదలుపెట్టారు. రెహమాన్, సంతోష శివన్ లాంటి దిగ్గజ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారు.