బాలయ్య వారసుడిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి

Published on Jun 12, 2019 1:24 am IST

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం కోసం ఆయన అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏమైనా క్లూ ఇస్తారేమో అని ఆసక్తిగా ఎదురుచూసేవారు అందరూ. కానీ బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. మోక్షజ్ఞ సైతం పెద్దగా బయట కనిపించకపోవడంతో ఆరంగేట్రం కోసం రెడీ అవుతున్నాడేమో అని ఆశపడ్డారు అందరూ.

కానీ తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ రీసెంట్ ఫోటోలు కొన్ని బయటికొచ్చాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సిద్ధంకాలేదా, అసలు సినిమాల్లోకి వచ్చే ఆలోచన అబ్బాయికి ఉందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే మోక్షజ్ఞకు సినిమాలకంటే వ్యాపార రంగం మీద ఎక్కువ ఆసక్తి అని, అటువైపే అతని అడుగులు పడుతున్నాయని అంటున్నారు. మరి వీటిలో నిజం ఏదో తేలాలన్నా, అభిమానులకు ఒక క్లారిటీ రావాలన్నా బాలయ్య నోరు విప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More