మళ్లీ ఫన్నీ కాన్సెప్ట్ తో.. మారుతి !

Published on May 9, 2019 8:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా ‘శైలజారెడ్డి అల్లుడు’ అంటూ మారుతి తెరికెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం అయింది. దాంతో మారుతి తరువాత సినిమా కూడా బాగా ఆలస్యం అయింది. చివరికీ మారుతి తన తర్వాత సినిమాని సాయి ధరమ్ తేజ్ తో చెయ్యటానికి రెడీ అయ్యాడు. కాగా తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఓ ఫన్నీ కాన్సెప్ట్ తో.. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ రెండో వారం నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. మారుతి యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇటు యూవీ వాళ్లు తేజుతో సినిమా చేయాలనుకుంటున్నారు. దాంతో తేజ్, మారుతి కాంబినేషన్ లో యూవీ క్రియేష‌న్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More