హీట్ పెంచుతున్న మాస్ కాప్ “భీమ్లా నాయక్”.!

Published on Aug 14, 2021 4:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి రేపు సాలిడ్ అప్డేట్ వస్తుండగా ఒక్కో అప్డేట్ అండ్ పోస్టర్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకొస్తుండంతో రేపటి అప్డేట్ పై పవన్ అభిమానుల్లో మరింత హీట్ పెరుగుతూ వస్తుంది..

లేటెస్ట్ గా వచ్చిన ఆన్ లొకేషన్ స్టిల్ చూసి కూడా మరింత క్రేజీగా పవన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ఒరిజినల్ చూసిన వారు అయితే ఈ చిత్రంలో ఒక మాస్ కాప్ గా పవన్ ఎలా ఉంటారా అని చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మొత్తానికి మాత్రం సంక్రాంతి రేస్ ని భీమ్లా నాయక్ స్టార్ట్ తో ఒక లెక్కలో మొదలు కానుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :