మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.
అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోసారి మాస్ పవర్ ఏమిటో చూపెట్టేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడట. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.