“పాగల్”కి తన వర్క్ ఫినిష్ చేసిన మాస్ కా దాస్.!

Published on May 26, 2021 12:01 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. “ఫలక్ నామా దాస్” సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో దాని తర్వాత నుంచి మంచి లైనప్ తో ముందుకొస్తున్నాడు. మరి అలా తాను చేసిన లేటెస్ట్ చిత్రం “పాగల్”. నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రం ఈ మే 1కే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల ఆగాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఈ చిత్రానికి విశ్వక్ సేన్ తన వర్క్ ను పూర్తిగా ముగించేసుకున్నాడు. ఈరోజే ఈ చిత్రానికి సంబంధించిన తన పూర్తి డబ్బింగ్ వర్క్ ను ఈ యంగ్ హీరో కంప్లీట్ చేసినట్టుగా తెలిపాడు. మరి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోని థియేటర్స్ లోనే విడుదల చెయ్యనున్నట్టుగా మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇక ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :