ఇది కూడా మాస్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్న మాస్ మహారాజ్.!

Published on Jul 8, 2021 9:00 am IST

మన టాలీవుడ్ ఓ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటే హీరోల్లో మాత్రం మాస్ మహారాజ్ రవితేజ ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ స్పీడ్ స్పీడ్ తో ఇప్పటికే “ఖిలాడి” సినిమాని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసిన రవితేజ ఇది చివరి దశలో ఉండగానే నూతన దర్శకుడు శరత్ మందవతో ఒక ఆసక్తికర పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రాన్ని స్టార్ట్ చేసేసారు.

మరి ఈ సినిమాని కూడా రవితేజ మామూలు స్పీడ్ తో కంప్లీట్ చెయ్యట్లేదు. ఆల్రెడీ దర్శకుడు రవితేజ మరియు హీరోయిన్ దివ్యాన్షా కౌశిక్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టుగా కూడా చూపించారు. దీనితో ఈ చిత్రం విషయంలో మాస్ మహారాజ్ ఎలా వర్క్ చేస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :