మరింత స్ట్రాంగ్ గా నిలబడుతున్న మాస్ మహారాజ్.!

Published on Jan 21, 2021 8:00 am IST

మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ సహా ఇతర హీరోల అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాస్ కం బ్యాక్ ఎట్టకేలకు సూపర్ స్ట్రాంగ్ గా “క్రాక్” తో ఇచ్చారు. తన దర్శకుడు గోపీచంద్ మలినేనితో హ్యాట్రిక్ చిత్రంగా అదిరిపోయే మాస్ మసాలా సినిమాను అందించారు.

మరి ఈ సంక్రాంతికి గాను అనేక చిక్కులతో వచ్చినప్పటికీ వాటన్నిటినీ తొక్కిపెట్టి సూపర్ స్ట్రాంగ్ గా మాస్ మహారాజ్ రవితేజ నిలబడుతుండడం విశేషం. ఇప్పటికీ కూడా క్రాక్ కు పలు చోట్ల స్క్రీన్స్, షోలు యాడ్ అవుతుండడమే కాకుండా ఇతర సినిమాలతో రీప్లేస్ చేసి కూడా క్రాక్ ప్రదర్శిస్తున్నారు.

దీనితో మరోసారి సంక్రాంతి విన్నర్ ఎవరో అన్నది క్లియర్ అయ్యిపోయింది అని చెప్పాలి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులకు గాను భారీ ఆఫర్స్ తో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

సంబంధిత సమాచారం :

More