‘రామారావు’గా మాస్ మహారాజా.. లుక్ వైరల్!

Published on Jul 12, 2021 10:08 am IST

మాస్ మహారాజ రవితేజ తన 68వ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ‘రామారావు’ అనే టైటిల్ తో పైగా ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఈ పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక పోస్టర్ లో రాసుకొచ్చిన మ్యాటర్ కూడా సినిమా పాయింట్ ఆఫ్ వ్యూను బాగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

ఇక ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తోన్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ పట్ల రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీతో ఉన్నారు. వారి హ్యాపినెస్ డబుల్ చేస్తూ తాజాగా చిత్రబృందం వదిలిన ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ఓపెనింగ్ డే నుండి చిత్రబృందం ప్రమోషన్స్ ను విభిన్నంగా ప్లాన్ చేస్తూ వస్తోంది. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా నటించబోతోంది.

సంబంధిత సమాచారం :