డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాల తీసే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తొలిసారిగా తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమా ‘మాస్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రానా సెట్స్ కి వెళ్లారు. ‘రఫ్’ ఆడియోకి హాజరయిన వీరు అటు నుండి షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. వెంకట్ ప్రభు, ప్రేమ్ జిలతో ముచ్చటించారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది.
కెరీర్ ఆరంభం నుండి సూర్య ప్రయోగాత్మక సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. రానా కూడా మొదటి నుండి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఫోటో చూసిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.


