ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో ‘బ్రూస్ లీ’ రిలీజ్

ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో ‘బ్రూస్ లీ’ రిలీజ్

Published on Oct 6, 2015 6:30 PM IST

Bruce-Lee1
కామెడీ, యాక్షన్ లకి సెంటిమెంట్ ని జోడించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ఉపశీర్షిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో రెండు రోజులు మాత్రమే బాలన్స్ ఉంది. ఈ రోజు ఉదయంతో రామ్ చరణ్ చివరి సాంగ్ షూట్ ని కూడా ఫినిష్ చేసేసాడు. దీంతో అక్టోబర్ 16న సినిమా పక్కాగా రిలీజ్ అవుతుందని ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి లోకల్ మరియు ఓవర్సీస్ లో సూపర్బ్ బిజినెస్ అయ్యిందని ఇదివరకే తెలియజేశాం.

బిజినెస్ పరంగానే కాదు రామ్ చరణ్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని భారీ ఎత్తున బ్రూస్ లీ సినిమాని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నారు. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు బ్రూస్ లీ సినిమాని ఓవర్సీస్ లో మొత్తంగా 350కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అందులో ఒక్క నార్త్ అమెరికాలోనే 220కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేయనుండడం విశేషం. ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ రిపోర్ట్ ఉండడం, శ్రీను వైట్ల సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉండడం మరియు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కనిపించనుండడంతో ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటోంది. మొదటి రెండు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ టచ్ చేస్తుందని సమాచారం.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపి మోహన్ – కోన వెంకట్ లు కలిసి కథని అందించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు