‘సైరా’ కోసం ప్రత్యేకమైన సెట్ !


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందించారు.

కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు. ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టం కోసమే ఈ సెట్ ను రూపొందించారు చిత్ర్రా యూనిట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్లో అమితాబ్ బచ్చన్, నయనతారలు కూడ పాల్గొంటున్నారు.