లేటెస్ట్..పవన్ – రానా చిత్రంపై మాసివ్ అప్డేట్ ఇదే.!

Published on Aug 12, 2021 8:01 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మరో స్టార్ హీరో రానా దగ్గుబాటిల కలయికలో ప్రస్తుతం ఓ సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంపై ఒక మాస్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

ఈ రా అండ్ రస్టిక్ చిత్రంలో మాస్ ఎలివేషన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి వాటినే ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఇప్పుడు పలు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

ఇవన్నీ కూడా ఈ చిత్రం నుంచి మాస్ ఆడియెన్స్ కి కానీ పవన్, రానా అభిమానులకి కానీ మంచి మాస్ ట్రీట్ మాత్రం పక్కా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :