సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.
ఇక మొన్న ఈ చిత్రం ట్రైలర్ ను రానా విడుదల చేశారు. ట్రైలర్ లో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ప్రధాన పాత్రలను.. ఆ పాత్రల మధ్య సంఘర్షణను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా శ్రీసింహా- సత్యల మధ్య వచ్చే సీన్స్ సినిమాలో బాగా అలరిస్తాయని అనిపిస్తోంది. అలాగే ట్రైలర్ చివర్లో శ్రీసింహా క్యారెక్టర్ లోని వెరియేషన్ చాల బాగుంది.
కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. మర్డరీ సస్పెన్స్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


