ఇండస్ట్రీ ఇంకో నెల రోజులు ఇలానే ఉంటుందట

Published on Apr 29, 2021 10:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు పరిశ్రమలు నెమ్మదిస్తున్నాయి. వాటిలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడ ఉంది. మొదటి వేవ్ సమయంలో ప్రభుత్వం ఉత్తర్వులతో షూటింగ్స్, సినిమాల విడుదలలు నిలిచిపోగా ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగానే ఇండస్ట్రీ మూతబడింది. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడిపోయాయి. కొత్త సినిమాల విడుదలలు ఆగిపోయాయి. దగ్గర దగ్గర 15 సినిమాలు వాయిదాపడ్డాయి. అంతేకాదు సెట్స్ మీద ఉన్న 25 సినిమాలు నిలిచిపోయాయి.

‘ఆచార్య, సర్కారు వారి పాట, పుష్ప, ఖిలాడి, పక్కా కమర్షియల్, ఎఫ్ 3′ లాంటి చాలా సినిమాలు ఆగిపోయాయి. పలు సినిమా బృందాల్లోని సభ్యులు కరోనాకు గురయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే, కళ్యాణ్ దేవ్, అనిల్ రావిపూడి, రమేష్ వర్మ’ లాంటి స్టార్లంతా కరోనాకు గురయ్యారు. మొదలవ్వాల్సిన కొత్త సినిమాలు ఆగిపోయాయి. నటీనటులు, నిర్మాతలు ఎవరికి వారు స్వచ్ఛందంగా సెలవులు తీసేసుకున్నారు. కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేవరకు షూటింగ్స్ జరపకూడదని డిసైడ్ అయ్యారు. ఇన్ సైడ్ టాక్ మేరకు మే నెల మొత్తం ఇండస్ట్రీ ఇలానే స్తంభించి ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :