దీన్ని బట్టి రవితేజ నెక్స్ట్ టైటిల్ అదేనేమో.?

Published on Jul 1, 2021 11:13 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ కాబడి ఈరోజు నుంచే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యినట్టు కూడా మేకర్స్ తెలిపారు. అయితే రవితేజ 68వ ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శరత్ మందవ తెరకెక్కిస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర హింట్స్ కానీ అప్డేట్స్ కానీ ఇస్తూ రవితేజ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు.

అయితే ఈ చిత్రంపై ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. కానీ అందులో ఎలాంటి టైటిల్ ను కూడా రివీల్ చెయ్యలేదు. అయితే ఈ పోస్టర్ కాన్సెప్ట్ ప్రకారం ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా కూడా ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక దీనిని పక్కన పెడితే కొన్ని రోజులు కితమే దర్శకుడు ఓ హింట్ ఇచ్చారు.

చిన్న పోస్టర్ పిక్ కట్ పెట్టి అందులో “లీడర్ ఆఫ్ ది ప్యాక్” అని పెట్టి వదిలేసారు. సో ఈ సినిమా కాన్సెప్ట్ పై అప్పుడే చెప్పడం ఈరోజు ప్రీ లుక్ పోస్టర్ కి అది సింక్ అవ్వడం జరిగింది. సో టైటిల్ ఇదే కావచ్చు లేదా దీనికి రిలేటెడ్ ఉండొచ్చని చెప్పాలి. మరి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం :