సాయంత్రం ట్రైలర్ తో సందడి చేయనున్న నాని !

12th, December 2017 - 12:39:19 PM

నేచ్యురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఈ నెల 21న భారీ ఎత్తున విడుదలకానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశారు. టీజర్, పాటలు బాగుండటం, నాని గత సినిమాలన్నీ వరుస విజయాలై ఉండటంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.

ఇకపొతేప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర థియేటరికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ భూమిక ఒక కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.