‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే సెన్సేషనల్ హీరోగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారబోతున్న సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ కి ప్రోత్సాహం అందించేందుకు “మీకు మాత్రమే చెప్తా ” అనే సినిమాతో విజయ దేవరకొండ తొలి అడుగు వేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు విడుదల చేశారు. కాగా ప్రస్తుతం టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
మొత్తానికి విజయ్ తన అభిరుచిని పరిచయం చేశాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రలు చేస్తున్నారు. మరి దేవరకొండ మొదటి వెంచర్ ఎలా ఉంటుందో చూడాలి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


