బుట్ట బొమ్మ, వాటే బ్యూటీ కవర్ సాంగ్ లతో “స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్2”

Published on Jul 26, 2021 6:16 pm IST


తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ మా ఛానెల్ సరికొత్త కార్యక్రమాలతో అలరిస్తోంది. అయితే సండే ను ఫండే గా మారుస్తూ మరొకసారి సిద్దం అవుతుంది స్టార్ మా. మొట్ట మొదటి సారిగా ఫేవరేట్ స్టార్స్ చేసిన పాటలకు కవర్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనుంది.అయితే సౌత్ ఇండియా సెన్సేషన్ అయిన బుట్ట బొమ్మ పాట కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరొకసారి ఈ పాట బుల్లి తెర పై సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా కవర్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్ 2 లో బుట్ట బొమ్మ కి కవర్ సాంగ్ చేయడం జరిగింది.

అదే విధంగా నితిన్ హిట్ మూవీ అయిన భీష్మ చిత్రం లోని వాటే బ్యూటీ పాట కి సైతం కవర్ సాంగ్ చేయడం జరిగింది. అంతేకాక మరికొన్ని పాటల తో కార్యక్రమం హుషారు గా జరిగింది అని చెప్పాలి. అందుకు సంబంధించిన కార్యక్రమం ఈ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :