మే నుండి సెట్స్ మీదకు మెగా హీరో సినిమా !

Published on Apr 28, 2019 4:00 am IST

మెగా ఫ్యామిలీ నుండి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అవ్వగా ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి రంగస్థలం కు రైటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్నాడు. ఇక ముందు నుండి చెపుతున్నట్లు ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటించనున్నాడు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

అయితే హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సివుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం :