
కథా బలం ఉన్న సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా, తన ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తోంది అంటే అది మంచి సినిమా అయ్యుంటుంది అనే బ్రాండ్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇటీవలే దిల్ రాజు తను నిర్మించిన ‘ఆర్య’ సినిమాలో బాగా ఫేమస్ అయిన ఫీల్ మై లవ్ అనే పాటలోని మొదటి లైన్ ‘ఫీల్ మై లవ్’ ని ఓ సినిమాకి టైటిల్ గా ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేసాడని ఇదివరకే తెలియజేశాం. ఇది ఎవరి కోసమా అని తెలుసుకుంటే మాకో ఆసక్తికర విషయం తెలిసింది.
ఇప్పటి వరకూ దిల్ రాజు తన బ్యానర్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లతో సినిమాలు చేసాడు. ఇప్పుడు రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అందుకోసమే ఓ ప్యూర్ లవ్ స్టొరీని సిద్దం చేయిస్తున్నాడట. ఆ సినిమా కోసమే దిల్ రాజు ‘ఫీల్ మై లవ్’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసినట్లు, అలాగే దిల్ రాజు ఈ సినిమా ద్వారా మరో కొత్త దర్శకుడుని పరిచయం చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలన్నీ సఫలమైతే దిల్ రాజు – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘ఫీల్ మై లవ్’ అనే టైటిల్ తో ఓ సినిమాని ఆశించవచ్చు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇది కాకుండా వరుణ్ తేజ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.