మే నుండి మెగా హీరో కొత్త సినిమా !
Published on Feb 26, 2018 12:35 pm IST

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సాయి ధరమ్ సినిమా చెయ్యబోతున్నాడు. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ముందుగా కిషోర్ తిరుమల ఈ సినిమాను నానితో చెయ్యాలని భావించాడు కాని నాని వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కిషోర్ అదే సబ్జెక్టుతో సాయి ధరమ్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. మే నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

గోపీచంద్ మలినేని తో సాయి ధరమ్ సినిమా ఉంటుందని నిర్మాతలు భగవాన్ ప్రకటించాడు. ఈ సినిమా మరియు కిషోర్ సినిమా రెండు ఒకేసారి చేస్తాడు తేజ్. ప్రస్తుతం ఈ హీరో కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook