మెగా హీరోకి కోవిడ్ నెగిటివ్ !

Published on Jul 13, 2020 10:19 pm IST


మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో చేస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమా షూట్ ప్రారంభించినప్పటి నుంచీ తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు షూట్ పూర్తి అవ్వడంతో కళ్యాణ్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. నెగిటివ్ రావడంతో తన కుంటుబాన్ని కలిశాడు. ఇక సూపర్ మచ్చి సినిమా త్వరలో ఓటిటీ ప్లాట్‌ఫామ్ లో రిలీజ్ కానుంది.

ఇక కళ్యాణ్ దేవ్ హీరోగా రచయిత ‘శ్రీధర్ సీపాన’ దర్శకత్వంలోనూ ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి పలు హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ‘శ్రీధర్ సీపాన’ మరి ఈ చిత్రం కోసం ఎలాంటి కథాకథనాలను రాశాడో చూడాలి.

ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు.

సంబంధిత సమాచారం :

More