వైరల్ అవుతున్న మెగా హీరోస్ చైల్డ్ హుడ్ ఫొటో…!

Published on Nov 22, 2019 7:30 pm IST

టాలీవుడ్ లో మెగా హీరోల సందడే వేరు. లెక్కకు మించిన హీరోలు మెగా ఫ్యామిలీని నుండి రావడంతో పాటు తమని తాము హీరోలుగా మలుచుకున్నారు. చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్ స్టార్ హీరో హోదా అందుకోగా, ఆ తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక వరుణ్ తేజ్,ధరమ్ తేజ్ కూడా మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ హీరోలందరూ ఒక చోట చేరి దిగిన చిన్నప్పటి ఫోటోని హీరో వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మేజర్ త్రో బ్యాక్’ అని కామెంట్ తో పోస్ట్ చేసిన ఆ ఫొటోలో వరుణ్ ఓ పదేళ్ల పిల్లాడిలా ఉన్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐతే ఆ ఫొటోలో వరుణ్ తో పాటు, బన్నీ, చరణ్, ధరమ్ తేజ్, నిహారిక కూడా ఉండటం విశేషం. ఇప్పుడు స్టార్స్ గా వెలుగొందుతున్న ఈ వీరందరూ ఒక చోట చేరిన ఆ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఇక వరుణ్ తన తదుపరి చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్నారు. ఈ ఏడాది వరుణ్ ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :