‘సౌండ్ కట్ ట్రైలర్’తో ‘రణరంగం’ !

Published on Aug 11, 2019 4:07 pm IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సౌండ్ కట్ ట్రైలర్ ను ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్లుగానే ట్రైలర్ లో సౌండ్ కట్స్ వెరీ ఎఫెక్టివ్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో చాల రకాల సౌండ్స్ చాల నేచ్యురల్ గా అనిపిస్తూ.. అలాగే చివర్లో వచ్చే బీజియమ్ వెరీ ఇంట్రస్టింగ్ అండ్ అటెంక్షన్ సౌండ్ తో సాగుతూ.. మొత్తానికి రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ సౌండ్స్ తోనే కథలోని సోల్ ను ఎస్టాబ్లిష్ చెయ్యటం చాల బాగుంది.

కాగా ఈ ట్రైలర్ ను చూస్తుంటే ‘గ్యాంగ్‌స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర శర్వా గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుందని అనిపిస్తోంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సౌండ్ కట్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :