డబ్బింగ్ మొదలుపెట్టిన మెగా హీరో !

Published on Aug 9, 2021 2:34 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ సినిమా డబ్బింగ్ మొదలైందని.. ముందుగా వరుణ్ తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాలో వరుణ్ మాడ్యులేషన్ చాలా కొత్తగా ఉంటుందట. మరో మూడు రోజులు పాటు వరుణ్ డబ్బింగ్ ఉంటుందట.. ఆ తరువాత మిగిలిన కీలక క్యారెక్టర్స్ డబ్బింగ్ వర్క్ మొదలవ్వనుంది.

కాగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది. మొదటిసారి వరుణ్ తేజ్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దీపావళి స్పెషల్ గా ఈ సినిమా రానుంది. అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు

సంబంధిత సమాచారం :