చరణ్, ఉపాసనల విషయంలో ఆనందంతో ఉప్పొంగిపోతున్న మెగా ఫ్యాన్స్

చరణ్, ఉపాసనల విషయంలో ఆనందంతో ఉప్పొంగిపోతున్న మెగా ఫ్యాన్స్

Published on Dec 12, 2022 7:06 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 2012లో తన స్నేహితురాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో కొనసాగుతున్న రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ గా రీచ్ సొంతం చేసుకున్నారు. ఇక తండ్రి మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా ఇటు వృత్తి అటు కుటుంబం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ హ్యాపీగా తన ఫామిలీ తో లైఫ్ కొనసాగిస్తున్నారు చరణ్.

అయితే విషయం ఏమిటంటే, చరణ్ ఉపాసన ఇద్దరూ త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు అంటూ కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దానితో అనేకమంది సినీ ప్రముఖులతో పాటు ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఈ విషయమై మెగా ఫ్యాన్స్ అయితే అమితానందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ వార్త కోసం మేము ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం, మొత్తంగా మెగాఫ్యామిలి లోకి చిన్నారి ఆగమనంతో ఆ కుటుంబంలో మరిన్ని సిరులు, సంతోషాలు కురిసేలా భగవంతుడు దీవించాలి అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు