మెగాస్టార్ ప్రాణవాయు సాయం 30 కోట్ల పైనే అట.!?

Published on May 27, 2021 11:06 am IST

మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఎప్పటి నుంచో అగ్ర స్థానంలో ఉండడమే కాకుండా పలు విపత్కర సమయాల్లో కూడా తానే ముందు స్పందించి తన సాయాన్ని అందించడంలో కూడా ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. అలా మెగాస్టార్ చిరు గత ఏడాది కరోనా టైం లో కోటి రూపాయల విరాళం ప్రకటించడమే కాకుండా తన ట్రస్ట్ ద్వారా వేలాది మంది సినీ కార్మికుల కడుపు నింపారు.

మరి మళ్ళీ ఈ ఏడాది కరోనా తీవ్రత పెరగడం ఎంతో ముఖ్యమైన ప్రాణవాయువు ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అలా ఎవరు చనిపోకూడదని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు మరియు కాన్సన్ట్రేటర్స్ ఉచితంగా పంపిణీ చేసే మహత్తర కార్యం మొదలు పెట్టారు.

నిన్ననే పూర్తి స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమంకు చిరు మరియు రామ్ చరణ్ లు 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని నిన్న టాక్ నడిచింది కానీ వాస్తవానికి 30 కోట్లకు పైగానే వారు తమ సొంత డబ్బుతో పంపిణీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం మెగాస్టార్ ఈ మెగా సాయం ఈ సమయంలో హర్షణీయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :