మెగాస్టార్ ‘ఆచార్య’ ప్రభుత్వ కార్యాలయం ?

మెగాస్టార్ ‘ఆచార్య’ ప్రభుత్వ కార్యాలయం ?

Published on Oct 18, 2020 3:03 AM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి. .కాకపోతే మెగాస్టార్ లేకుండా మిగిలిన సీన్స్ ను షూట్ చేసే ఆలోచనలో కొరటాల ఉనారని సమాచారం. షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వర్క్ ను వేస్తున్నారని.. ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయం సెట్ ను వేయడం దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది.

మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు