భారీ విరాళాలు ప్రకటించిన మెగాస్టార్, సూపర్ స్టార్లు.!

Published on Oct 20, 2020 2:54 pm IST

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా ఆపత్కర పరిస్థితులు నెలకొంటే తెలుగు సినిమా పరిశ్రమ ఏకధాటిగా కదులుతుంది అని మరోసారి నిరూపితం అయ్యింది. గత నాలుగేళ్ల కితం ఆంధ్రలో హుద్ హుద్ వచ్చినపుడు టాలీవుడ్ అగ్రతారలు అంతా అందించిన కంట్రిబ్యూషన్ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అదే విధంగా తెలంగాణాలో వచ్చిన దారుణ వరదల మూలాన హైదరాబాద్ నగరానికి మరియు నష్టపోయిన కుటుంబాలకు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. మద్దతుగా బాలయ్యతో మొదలు కొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, కింగ్ నాగార్జున దర్శకుడు త్రివిక్రమ్, అనీల్ రావిపూడి, హరీష్ శంకర్ ఇలా ఎందరో ఆర్ధిక సాయంతో ముందుకొచ్చారు.

అలాగే మన తెలుగు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు చెరో కోటి రూపాయల చొప్పున భారీ విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :

More